logo

విద్యకు పేదరికం అడ్డు కారాదు

విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా

Published : 28 Jun 2022 04:50 IST

నమూనా చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే : విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీసత్యసాయి జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా మూడో ఏడాది 1,66,441 మంది విద్యార్థులకు, రూ.249.661 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేసేందుకు మెగా చెక్కును జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లులకు అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే, ధనం కంటే, విద్య ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి, ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యా దానం అనంతమైనదని, దానం చేస్తున్నకొద్దీ విజ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ల్యాప్‌టాప్‌లు సెప్టెంబరులో అందిస్తామన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలను పాఠశాలలకు పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అన్ని రకలా మౌలిక సదుపాయాలతో సమకూరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా సంఘం కమిటీ ఛైర్మన్‌ రమణారెడ్డి, పుడా ఛైర్మన్‌ లక్ష్మీనరసమ్మ, ఛైర్మన్‌ తుంగ ఓబుళపతి, ఎంపీపీ రమణారెడ్డి, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ మాధవరెడ్డి, మండల విద్యాధికారి వెంకటరమణానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని