logo

వారసులుండగా బ్యాంకులో సొమ్ము డ్రా చేశారు

వారసులుండగా మా నాన్న బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారని, పోలీసులు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని చెన్నేకొత్తపల్లి ఎన్‌.ఎస్‌.గేట్‌కి చెందిన జ్యోతి జిల్లా అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌కి

Published : 28 Jun 2022 04:50 IST

పుట్టపర్తి గ్రామీణం న్యూస్‌టుడే: వారసులుండగా మా నాన్న బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారని, పోలీసులు, బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని చెన్నేకొత్తపల్లి ఎన్‌.ఎస్‌.గేట్‌కి చెందిన జ్యోతి జిల్లా అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌కి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. 48 మంది బాధితులు అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ తన తండ్రి ఆదినారాయణ బెంగలూరులో రైల్వేలో పనిచేస్తూ ఏప్రిల్‌ 2020లో పదవీ విరమణ పొందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము తండ్రి ఖాతాకు జమచేశారని, దీన్ని గుర్తించిన తమ చిన్నాన్న భార్య సొమ్మును కాజేయాలన్న ఆలోచనతో బెంగళూరు కెనరా బ్యాంకుకు వెళ్లి చిరునామాలు మార్చి డబ్బులు డ్రా చేసే ప్రయత్నం చేశారు. ఇలా మార్పులు జరిగిన ఐదు రోజులకే తమ తండ్రి మరణించాడని,  తండ్రి మరణం తరువాత రూ.6 లక్షలు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులపై ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు..

* చేసిన పనికి రావాల్సిన కూలి రూ.5.30 లక్షలు ఇవ్వాలని అడిగితే దౌర్జాన్యానికి దిగుతున్నాడని బేల్దారు దావిద్‌ అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇతనిది కర్నూలు జిల్లా కోవెలకుంట్ల అమడాల గ్రామం. బతుకు తెరువు కోసం ఊరూరా తిరిగి కూలీలను పోగు చేసి పనులు చేయిస్తుంటాడు. 2020 నవంబరులో లేపాక్షి నవోదయ పాఠశాలలో సింగనమలకు చెందిన రంగారెడ్డి ఆధ్వర్యంలో 10 కుటుంబాలు అక్కడే బస చేసి ఏడు నెలల కాలం నిర్మాణ పనులు చేసినట్లు, అందుకు రూ.5.30 లక్షల వరకు కూలి బకాయి రావాల్సి ఉండగా ఇవ్వాలని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని దౌర్జన్యానికి దిగుతున్నాడని దావిద్‌ ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని