logo

రూ.6 వేల కోసం హత్య

అనంతపురం నగరం కోవూరు నగర్‌లో రెండు రోజుల కిందట జరిగిన అశోక్‌ హత్యకేసును నాలుగో పట్టణ పోలీసులు ఛేదించారు. అప్పుగా తీసుకున్న రూ.6వేలు తిరిగి చెల్లించలేదనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.

Published : 28 Jun 2022 04:50 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం నగరం కోవూరు నగర్‌లో రెండు రోజుల కిందట జరిగిన అశోక్‌ హత్యకేసును నాలుగో పట్టణ పోలీసులు ఛేదించారు. అప్పుగా తీసుకున్న రూ.6వేలు తిరిగి చెల్లించలేదనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. వాటి వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లగించారు. చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బెంగళూరుకు చెందిన అశోక్‌కుమార్‌ అనంతపురం నగరంలో కూలీ పనులు చేసుకుంటూ రాత్రి సమయంలో కోవూర్‌ నగర్‌ మహత్మాగాంధీ షెల్టర్‌ ఫర్‌ హోమ్‌లెస్‌ పీపుల్‌ ఆశ్రమంలో ఉండేవారు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయంతో శ్రీనివాసులు నుంచి రూ.6 వేలు అశోక్‌కుమార్‌ అప్పు తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని, ఈ విషయంలో ఎలాగైనా అశోక్‌ను చంపాలని పథకం వేశాడు. ఈ నెల 25న అశోక్‌ ఆశ్రమంలో ఉండగా..అప్పు విషయంలో గొడవపెట్టుకుని పథకం ప్రకారం అతని తలపై రోకలి కట్టెతో బాది చంపాడు. సీఐ జాకీర్‌హుస్సేన్‌ తన బృందంతో వెళ్లి ఎన్‌హెచ్‌ 44 రోడ్డు పక్కన గల పాత రెడ్‌పెప్పర్‌ హోటల్‌ వద్ద అరెస్టు చేశారు. అతని నుంచి రోకలి కట్టె స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని