logo

చెస్‌ పోటీల్లో సత్తా

జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి అండర్‌-19 ఓపెన్‌, బాలికల చదరంగం పోటీలు జరిగాయి. ఏ1 చెస్‌ అకాడమీలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 47 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఆరు రౌండ్ల పోటీలు నిర్వహించి

Published : 29 Jun 2022 05:32 IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి అండర్‌-19 ఓపెన్‌, బాలికల చదరంగం పోటీలు జరిగాయి. ఏ1 చెస్‌ అకాడమీలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 47 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఆరు రౌండ్ల పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి పోటీలు వచ్చే నెల 2, 3 తేదీల్లో అనంతలక్ష్మి అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా చెస్‌ సంఘం కార్యదర్శి ఉదయ్‌కుమార్‌నాయుడు తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల వివరాలను ఆయన ప్రకటించారు. ఓపెన్‌ విభాగంలో అఫ్రీద్‌ఖాన్‌, శామ్యూల్‌ స్టీఫెన్‌ నోబుల్‌, విశ్వాస్‌, అచ్యుతరామరాజులు వరుసగా తొలి నాలుగు స్థానాలను సాధించారు. బాలికల విభాగంలో కె.సంజన, శ్రావణి, ఫర్హత్‌, వర్ణిగ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా చెస్‌ సంఘం అధ్యక్షుడు శివకుమార్‌, కార్యదర్శి ఉదయ్‌కుమార్‌నాయుడు, ముఖ్య ఆర్బిటర్‌ మల్లికార్జున హాజరై విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని