logo

అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు భూముల పరిశీలన

సౌర విద్యుత్తుకేంద్రం ఏర్పాటుకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌; శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు ప్రతినిధులు మంగళవారం ప

Published : 29 Jun 2022 05:40 IST

ముదిగుబ్బ మండలం సానేవారిపల్లిలో భూముల మ్యాప్‌ను పరిశీలిస్తున్న కంపెనీ ప్రతినిధులు, అధికారులు

కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌, ముదిగుబ్బ, న్యూస్‌టుడే: సౌర విద్యుత్తుకేంద్రం ఏర్పాటుకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌; శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు ప్రతినిధులు మంగళవారం పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో 1000 నుంచి 2వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరచినట్లు ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.  సుమారు 15వేల ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు భూముల్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. డి.హీరేహాళ్‌ మండలం సోమలాపురం, కూడ్లూరు, కాదలూరు, మురడి; కణేకల్లు మండలంలో యర్రగుంట, గనిగెర, జక్కలవడికి; బొమ్మనహాళ్‌ మండలంలో ఏళంజి, ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి, పెద్దచిగుళ్లరేవు, జొన్నలకొత్తపల్లి పంచాయతీల్లోని భూములను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రతినిధులు జైమిన్‌గాంధీ, పటేల్‌ కేతన్‌, రాకేష్‌చంద్ర, అనిల్‌కుమార్‌ యాదవ్‌, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజరు కోదండరామ్మూర్తి, ఆర్డీవోలు నిషాంత్‌రెడ్డి, వరప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని