logo

రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

కొత్తగా రేషన్‌ కార్డులు కావాల్సిన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణరెడ్డి తెలిపారు. దరఖాస్తుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉందని, బుధ, గురు వారాల్లో సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో

Published : 29 Jun 2022 05:40 IST

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: కొత్తగా రేషన్‌ కార్డులు కావాల్సిన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణరెడ్డి తెలిపారు. దరఖాస్తుకు రెండు రోజులు మాత్రమే గడువు ఉందని, బుధ, గురు వారాల్లో సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వీరందరికీ వచ్చే నెలలో కార్డులు ఇస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తు స్థితిని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల్లో పరిశీలించి నిర్ధారించుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని