logo
Published : 30 Jun 2022 02:43 IST

పింఛన్ల సొమ్ము దుర్వినియోగంపై కేసు

సోమందేపల్లి: మండలంలో ప్రభుత్వ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో 2011 నుంచి 2016 వరకు మొత్తం రూ.10.69 లక్షల దుర్వినియోగంపై సోమందేపల్లి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అప్పటి ఇన్‌ఛార్జి ఎంపీడీవో నాగరాజరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల మే 13న కేవలం ఆరు మందిపై వివిధ సెక్షన్ల కింద అప్పటి ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేశారు. అప్పట్లో మండలంలో పింఛన్ల పంపిణీ చేపట్టిన వారిలో ముగ్గురు గ్రామ రెవెన్యూ అధికారులు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు, ఒక మండల కోఆర్డినేటర్‌, పలువురు సీఎస్‌పీలు, వీఓలు చొప్పున ఇలా మొత్తం సొమ్ము దుర్వినియోగం చేసిన వారిలో ఉండటం గమనార్హం. మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన సమాచార హక్కు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబూప్రసాద్‌... ఈ దుర్వినియోగమైన ప్రజాధనాన్ని సంబంధించిన వారి నుంచి వసూలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహ చట్టం ద్వారా ప్రశ్నిస్తూ చివరకు లోకాయుక్తలో కేసు వేయడంతో స్పందించిన అధికారులు చివరకు కేసు నమోదు చేయించడం గమనార్హం. ఇదే నేపథ్యంలో ఎంపీడీవో ప్రభాకర్‌ నాయక్‌ స్పందించి పింఛన్ల సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన 40 మందిపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద వారి ఆస్తులను జప్తు చేసి, సొమ్ము వసూలుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌కు నివేదించారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని