నాకు చెప్పకుండా పనులెలా చేస్తావ్!
సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌పై సర్పంచి భర్త బెదిరింపు
చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: ‘మా పంచాయతీలో ఏం జరుగుతుందో చెప్పవా.. నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావ్? నాకు తెలియకుండా పనులు ఎట్టా చేస్తావ్? నీకు దమ్ముంటే.. నా పంచాయతీలోకి రా..’ అంటూ చెన్నేకొత్తపల్లి మండలం పులేటిపల్లి గ్రామ అధికార పార్టీ సర్పంచి భర్త భాస్కర్‌రెడ్ఢి. ఇంజినీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీటికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘అన్ని విషయాలు చెప్పాను కదా..’ అని సదరు ఉద్యోగి చెప్పినా ‘ఒకసారి చెబితే సరిపోతుందా..’ అంటూ ఊగిపోయారు. ‘నాకు చెప్పకుండా నా పంచాయతీలో మీ కులంవాళ్లకు బిల్లులు చేస్తావా?’ అంటూ గద్దించారు. అనంతరం విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన అధికారపార్టీ నేత, సర్పంచి భర్త అతన్ని అడ్డగించి భౌతిక దాడికి దిగినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కొందరు నాయకులు రంగంలోకి దిగి ఉద్యోగిని చెన్నేకొత్తపల్లి ఎంపీడీవో సరస్వతి గదిలోకి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం ఎంపీడీవో సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన విలేకరులను లోపలికి అనుమతించలేదు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో తనపై భాస్కర్‌రెడ్డి దాడికి పాల్పడలేదని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆడియోను ఆపేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్ శ్రీకాంత్ పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందితే కేసు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్ షేక్
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- BSNL నుంచి లాంగ్‌ప్లాన్.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్