logo

అకాడమీ జట్టు జయభేరి

ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-16 బాలికల ఇన్‌స్పైర్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో అనంతపురం క్రీడా అకాడమీ జట్టు ఘనవిజయం సాధించింది. అనంత క్రీడాగ్రామంలో జరిగిన ఈ పోటీలో అకాడమీ జట్టు తెలంగాణలోని గజ్వేల్‌ జట్టును 21-0తో

Published : 07 Jul 2022 03:17 IST

సాయివర్షితకు బహుమతి అందజేస్తున్న కెన్నెడి

అనంతపురం క్రీడలు: ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌-16 బాలికల ఇన్‌స్పైర్‌ ఫుట్‌బాల్‌ పోటీల్లో అనంతపురం క్రీడా అకాడమీ జట్టు ఘనవిజయం సాధించింది. అనంత క్రీడాగ్రామంలో జరిగిన ఈ పోటీలో అకాడమీ జట్టు తెలంగాణలోని గజ్వేల్‌ జట్టును 21-0తో చిత్తుచేసింది. అకాడమీ జట్టులోని సాయివర్షిత, సుస్మిత చెరో ఆరు గోల్స్‌ చేసి ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. అనూష 3 గోల్స్‌, నందిని 2 గోల్స్‌ చేయడంతో జట్టు అలవోకగా విజయం సాధించింది. మరో పోటీలో గోవా జట్టు చెన్నై జట్టుపై 11-0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. ఫాతిమా 6 గోల్స్‌, మెర్లిన్‌ 3 గోల్స్‌ చేసి జట్టును విజయపథంలో నడిపించారు. ఉత్తమ ప్రతిభ చూపిన అకాడమీ బాలికలకు శిక్షకుడు కెన్నెడి చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని