logo

హత్య కేసులో భార్య, ప్రియుడి అరెస్టు

ఎవరికీ అనుమానం రాకుండా భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసిన కేసులో భార్యతోపాటు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెట్నేపల్లికి చెందిన అశోక్‌కుమార్‌(45) పెద్దవడుగూరులో సహాయ విద్యుత్తు లైన్‌మెన్‌గా చేస్తుండేవారు.

Published : 07 Jul 2022 03:17 IST

గుత్తి, న్యూస్‌టుడే: ఎవరికీ అనుమానం రాకుండా భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసిన కేసులో భార్యతోపాటు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెట్నేపల్లికి చెందిన అశోక్‌కుమార్‌(45) పెద్దవడుగూరులో సహాయ విద్యుత్తు లైన్‌మెన్‌గా చేస్తుండేవారు. ఆయనను ఏప్రిల్‌ 12న హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తాడిపత్రి డీఏస్పీ చైతన్య చెప్పారు. బుధవారం కవితతోపాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేసి వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు.. బసినేపల్లికి చెందిన హరికృష్ణ ఊరూరా తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అశోక్‌కుమార్‌ భార్య కవితతో పరిచయం ఏర్పడింది. అశోక్‌ కుమార్‌ తాగుడుకు హరికృష్ణ డబ్బులు ఇస్తూ అతడి భార్య కవితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. జీతమంతా తన భర్త తాగుడికే తగలేస్తున్నాడని, అతడిని అడ్డుతొలగించుకుంటే ఉద్యోగంతోపాటు పింఛను వస్తుందని కవిత ఆశపడింది. పైగా ప్రియుడితో కలిసి జీవించాలనుకుంది. ఏప్రిల్‌ 12న మధ్యాహ్నం గుత్తిఆర్‌.ఎస్‌. శివారులోని రైల్వే వంతెన వద్ద బాలన్న నీటికుంట సమీపంలో మద్యం తాగుతున్న అశోక్‌కుమార్‌ను కవిత, ప్రియుడు హరికృష్ణ కలిసి నీటిలో ముంచి చంపేసి ఏమీ తెలిదన్నట్లు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన భర్త ఇంటికి రాలేదని కవిత తన కుటుంబీకులు, బందఫువులను నమ్మించి వెదికించింది. తాను వెదికినట్లు నటించి నీటికుంటలో తన భర్త మృతదేహం ఉందని బంధువులను చెప్పింది. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు గుత్తి ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. తన భర్త నీటికుంటలో పడి మరణించినట్లు కవిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లోతుగా దర్యాప్తును చేపడుతుండటంతో మంగళవారం కవిత, హరికృష్ణ తామే అశోక్‌కుమార్‌ను హత్యచేసినట్లు బసినేపల్లి వీఆర్‌వో భీమలింగయ్య ఎదుట లొంగిపోయారు. గుత్తి ఇన్‌ఛార్జి సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు వీరిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని