logo

నకిలీ ధ్రువపత్రాలు విక్రయించిన ఉద్యోగి

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న రికార్డు అసిస్టెంట్‌ షేక్షావలి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతపురం రాణినగర్‌కు చెందిన సి.గోపాల్‌ అనే

Published : 07 Jul 2022 03:17 IST

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న రికార్డు అసిస్టెంట్‌ షేక్షావలి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతపురం రాణినగర్‌కు చెందిన సి.గోపాల్‌ అనే వ్యక్తి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసినట్లు ధ్రువపత్రాలు సృష్టించాడు. ఇందుకోసం రూ.1.28లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధ్రువపత్రాలు పొందిన అభ్యర్థి కాన్వకేషన్‌ కోసం దరఖాస్తు చేశాడు. సర్టిఫికెట్‌ నెంబరు సరిపోకపోవడంతో పరీక్షల విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. 2017-21లో బీటెక్‌ ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో పూర్తి చేసినట్లు సర్టిఫికెట్‌ సృష్టించారు. పరీక్షల విభాగం అధికారులు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించారు. గోపాల్‌ అనే విద్యార్థి ఇంజినీరింగ్‌ చేయలేదని తేల్చారు. అయితే సర్టిఫికెట్‌లో ఉన్న నంబరుతో మరో విద్యార్థి చదివాడు. సర్టిఫికెట్‌ నెంబరు ఒకటే, కానీ గోపాల్‌ అనే వ్యక్తితో మరో సర్టిఫికెట్‌ సృష్టించారు. ఇందులో ప్రమేయం ఉన్న షేక్షావలి అనే రికార్డు అసిస్టెంట్‌ మరో వివాదంలో ఇప్పటికే సస్పెండ్‌ అయ్యాడు. నకిలీ సర్టిఫికెట్‌ అంశంపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్‌ పోలీసు అధికారులకు లేఖ పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని