logo

వరాలివ్వమ్మా.. వరలక్ష్మీ

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాలు, గృహాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని.. పసుపు, కుంకుమలతో సుమంగళిగా

Published : 06 Aug 2022 05:34 IST

శివకోటిలో శివకామేశ్వరి

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాలు, గృహాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని.. పసుపు, కుంకుమలతో సుమంగళిగా ఉండాలని కోరుతూ మహిళలు వ్రతమాచరించారు. అనంతలోని కొత్తూరు కన్యకాపరమేశ్వరి, హెచ్చెల్సీకాలనీలోని ఆలయంలో సామూహిక పూజలు చేసి, వరలక్ష్మిని పూజించారు. శివకోటి, శంకరమఠం, హెచ్చెల్సీకాలనీ నసనకోట ముత్యాలమ్మ, మొదటిరోడ్డులో చౌడేశ్వరి, పాతూరు మహాలక్ష్మి అమ్మవార్లకు విశేషాలంకరణ చేశారు.

వ్రతమాచరిస్తున్న మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని