logo

ఎంపీ తీరు సిగ్గుచేటు

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీరు సిగ్గుచేటని పలువురు నాయకులు మండిపడ్డారు. ఎంపీ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రావడంపై తెదేపా, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం

Published : 06 Aug 2022 05:34 IST

ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న తెదేపా, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీరు సిగ్గుచేటని పలువురు నాయకులు మండిపడ్డారు. ఎంపీ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రావడంపై తెదేపా, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని సప్తగిరి కూడలిలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండు చేశారు. తక్షణమే ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్‌.రాజు, కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు లక్ష్మీనరసింహ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప, ప్రధాన కార్యదర్శి పరశురాం, అనంత పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు ధనుంజయనాయుడు పాల్గొన్నారు.

ప్రజలే బుద్ధి చెబుతారు
గోరంట్ల మాధవ్‌ కమ్మ కులాన్ని తిట్టడం హాస్యాస్పదం అని కమ్మ సంఘం నాయకుడు బాంబే డయింగ్‌ నాగన్న పేర్కొన్నారు. శుక్రవారం కమ్మ భవనం వద్ద వారు మాట్లాడుతూ ఓ కులాన్ని లక్ష్యంగా తీసుకుని మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో ఎస్పీ, కలెక్టరు దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.

తప్పును కప్పి పుచ్చుకొనేందుకే
తప్పును కప్పి పుచ్చుకొనేందుకు ఎంపీ మాధవ్‌ కుల ప్రస్తావన తెస్తున్నారని కమ్మ సేవాసంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లాగుండ్ల రాజు పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అశ్లీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వస్తే సచ్ఛీలతను నిరూపించుకోవాల్సింది పోయి కులప్రస్తావన తీసుకొని రావడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా లక్ష్మీనారాయణ, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వరనాయుడు పాల్గొన్నారు.

మాధవ్‌ ఇంటి ముట్టడి భగ్నం
ఎంపీ మాధవ్‌ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన చంద్రదండు అధ్యక్షుడు ప్రకాష్‌నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ్‌ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎదుటి వారిపై నెపం నెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించడం తగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని