logo

11 వరకూ పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ గడువు పెంచారు. 6వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని తొలుత ప్రకటించారు. తాజాగా గడవు పెంచినట్లు ప్రిన్సిపల్‌ శివశంకర్‌ తెలిపారు. 7 నుంచి 11 వరకు ర్యాంకులతో సంబంధం లేకుండా

Published : 06 Aug 2022 05:34 IST

విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ గడువు పెంచారు. 6వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ఉంటుందని తొలుత ప్రకటించారు. తాజాగా గడవు పెంచినట్లు ప్రిన్సిపల్‌ శివశంకర్‌ తెలిపారు. 7 నుంచి 11 వరకు ర్యాంకులతో సంబంధం లేకుండా అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చన్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో 10 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు, 5 ప్రైవేటు కళాశాలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 1980 సీట్లు ఉన్నాయి. అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గంలోని కళాశాలల్లో కౌన్సెలింగ్‌ జరుగుతోంది. ఇప్పటి వరకూ సుమారు 2వేల మంది హాజరైట్లు ప్రిన్సిపల్‌ తెలిపారు. శుక్రవారం 300 మంది విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు.


నేటి నుంచి టెట్‌ పరీక్షలు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2022 ఈ నెల 6 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. అనంతపురం జిల్లాలో 7, శ్రీసత్యసాయి జిల్లాలో ఒక కేంద్రంలో, బెంగళూరులో 15 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందే చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్లు, రెండు పాస్ట్‌పోర్టుసైజు పోటోలు, ఆధార్‌, పాన్‌కార్డు, ఇతర సర్టిఫికేట్లతో పరీక్ష కేంద్రానికి రావాలన్నారు. సాయం కోసం 81432 92358 ఫోను నంబరు ద్వారా సంప్రదించవచ్చన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని