logo

కుళ్లాయిస్వామి గోవిందా..

మత సామరస్యానికి ప్రతీకైన గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం పెద్దసరిగెత్తు కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున డప్పు, వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు.

Published : 09 Aug 2022 04:07 IST

కనుల పండువగా పెద్ద సరిగెత్తు


ప్రత్యేకాలంకరణలో ఆంజనేయస్వామి

నార్పల గ్రామీణం, న్యూస్‌టుడే: మత సామరస్యానికి ప్రతీకైన గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం పెద్దసరిగెత్తు కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున డప్పు, వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు హుసేనప్ప ఆధ్వర్యంలో కుళ్లాయిస్వామితోపాటు కొలువుదీరిన 21 పీర్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని వెండి, బంగారు గొడుగులతో అలంకరించారు. భక్తులు పానకాలు సమర్పించి, చక్కెర చదివింపులతో మొక్కులు చెల్లించారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి వెండి గొడుగులు అందజేశారు. ఎండు కొబ్బరి అగ్నిగుండంలో వేసి కుళ్లాయిస్వామి గోవిందా అంటూ అగ్నిగుండం చుట్టూ పొర్లు దండాలతో వేడుకున్నారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయంలో పూజారి వెంకటరాయ చలపతి ఆధ్వర్యంలో స్వామికి అర్చనలు, అభిషేకాలు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళవారం సాయంత్రం స్వామితోపాటు 21 పీర్లు అగ్నిగుండ ప్రవేశంతో జలధికి తరలివెళ్లనున్నాయి. సీఐ అస్రార్‌ బాషా, ఎస్సై వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు