logo

పాఠశాల కరస్పాండెంట్‌ ఆత్మహత్య

పట్టణంలోని శ్రీసాయి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ (44) సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు...

Published : 09 Aug 2022 04:07 IST

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీసాయి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ (44) సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు... స్థానిక బ్రాహ్మణవీధికి చెందిన విజయ్‌కుమార్‌ కొన్నేళ్లుగా ప్రైవేట్‌ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇంట్లో కుటుంబసభ్యులు లేని సమయంలో గదిలోకి వెళ్లి ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. ఆయన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుల ఒత్తిడి కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకోసం, పాఠశాల నిర్వహణ కోసం అప్పులు చేశానని, కుటుంబసభ్యులకు అప్పులకు ఎలాంటి సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. విజయ్‌కుమార్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఉన్నత చదువులు చదవలేకపోయానని..

హిందూపురం పట్టణం: ఉన్నత చదువులు చదవలేకపోయానని మనస్తాపం చెందిన హిందూపురం గ్రామీణ మండలం సంజీవరాయనపల్లికి చెందిన నాగరాజు (25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ఖరీమ్‌ తెలిపిన వివరాల మేరకు.. సంజీవరాయనపల్లికి చెందిన హనుమంతప్ప, శాంతమ్మ కుమారుడు డిగ్రీ వరకు చదివి ఊడుగులుపల్లి వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఉన్నత చదువులు చదవాలని కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో నిరాశ చెందాడు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం గ్రామ సమీపంలోని ఒక బావిపైన చెప్పులు ఉండటంతో వాటి ఆధారంగా  గ్రామస్థులు గాలించారు. నాగరాజు మృతదేహాన్ని గుర్తించారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts