logo

విద్యుదాఘాతంతో రైతు మృతి

మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సురేష్‌ (35) ఆదివారం రాత్రి

Published : 09 Aug 2022 04:07 IST

వజ్రకరూరు (ఉరవకొండ), న్యూస్‌టుడే: మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సురేష్‌ (35) ఆదివారం రాత్రి తాను కౌలుకు సాగు చేసుకుంటున్న పొలంలో బోరు దగ్గర ఉన్న స్టార్టర్‌ పెట్టెలో స్విచ్‌ ఆన్‌ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. అతడిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న యువ రైతు మృతి తీరని విషాదాన్ని మిగిల్చింది. భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

బస్సు ఢీకొని మహిళ..

మడకశిర, న్యూస్‌టుడే : పట్టణ పరిధిలోని శివాపురం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ (57) అనే మహిళ దుర్మరణం పాలైంది. శివాపురం నుంచి గంగమ్మ, హనుమంతప్పలు ద్విచక్రవాహనంపై టీడీపల్లి గ్రామానికి వెళ్తుండగా పావగడ వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గాయపడిన హనుమంతప్పను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని