logo

ఎంపీ మాధవ్‌ను సస్పెండ్‌ చేయాల్సిందే..

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి కుల ప్రస్తావన తీసుకురావడం సరికాదని బత్తలపల్లి కమ్మ సంఘం నాయకులు పేర్కొన్నారు. కమ్మ కులస్థులను దూషించిన ఎంపీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు.

Published : 09 Aug 2022 04:07 IST

కూడలిలో గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కమ్మసంఘం నాయకులు

బత్తలపల్లి, న్యూస్‌టుడే: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి కుల ప్రస్తావన తీసుకురావడం సరికాదని బత్తలపల్లి కమ్మ సంఘం నాయకులు పేర్కొన్నారు. కమ్మ కులస్థులను దూషించిన ఎంపీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. సంఘం నాయకుడు సుబ్బరాయుడు, తెదేపా మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బత్తలపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గోరంట్ల మాధవ్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం పెద్ద సంఖ్యలో ఆర్డీటీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కూడలి వద్దకు చేరుకొని ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరి ఆందోళనతో అరగంటపాటు రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీహర్ష అక్కడికి చేరుకొని అంతరాయం లేకుండా వాహనాలను పంపించారు. కార్యక్రమంలో కమ్మ సంఘం నాయకులు గంటాపురం జగ్గు, సురేంద్ర, రమణ, అయ్యప్ప, అప్పస్వామి, ఓబుళనాయుడు, రంగానాయుడు, హరి, చంద్ర, పవన్‌, సూరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని