logo

పుట్టపర్తిలో 200 పడకల ఆసుపత్రి

శ్రీసత్యసాయిజిల్లా ఏర్పాటు నేపథ్యంలో పుట్టపర్తిలో జిల్లా స్థాయి ఆసుపత్రి ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 200 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 09 Aug 2022 04:07 IST

స్థల సేకరణకు ప్రభుత్వ ఆదేశాలు

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయిజిల్లా ఏర్పాటు నేపథ్యంలో పుట్టపర్తిలో జిల్లా స్థాయి ఆసుపత్రి ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 200 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సరిపడా భూమిని సేకరించాలని అటు వైద్య ఆరోగ్య, ఇటు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈమేరకు కర్ణాటకనాగేపల్లి వద్ద టిడ్కో గృహసముదాయం సమీపంలో సర్వేనంబరు 646-2, 3, 4, 647-4, 5లో దాదాపు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో వైద్య కళాశాల, ఇంక పడకలు పెంచాల్సి వస్తే సరిపడా స్థలం ఉండాలన్న ఉద్దేశంతో 15 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల సేవలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో అందుబాటులోకి తెచ్చే విధంగా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని