logo

1.51 లక్షల జెండాలు పంపిణీ చేద్దాం

‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం. అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. 1.51 లక్షల జాతీయ జెండాల పంపిణీకి సిద్ధం చేయాలి’ అని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు.

Published : 09 Aug 2022 04:07 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ కేతన్‌గార్గ్‌

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం. అన్ని శాఖల అధికారులు భాగస్వామ్యం కావాలి. 1.51 లక్షల జాతీయ జెండాల పంపిణీకి సిద్ధం చేయాలి’ అని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం తర్వాత ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ కేతన్‌గార్గ్‌తో కలిసి ఆమె జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వేడుకలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్‌ మైదానంలోకి సాధారణ ప్రజలు కూడా వస్తారని, ఆ మేరకు ఏర్పాట్లు, వసతులు కల్పించాలని సూచించారు. శకటాల తయారీ, స్టాళ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో మెరుగైన పనితీరు కనబరిచిన వారిని అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. ఈనెల 10లోపు జాబితాలు పంపాలని ఆమె సూచించారు.

430 అర్జీలు స్వీకరణ: సోమవారం స్పందన కార్యక్రమంలో 430 మంది బాధితులు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరమ్‌ ధ్రువీకరణ తదితర సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. అర్జీలు స్వీకరించిన వారిలో డీఆర్‌ఓ గాయత్రీదేవి, ఆన్‌సెట్‌ సీఈఓ కేశవనాయుడు, ఆర్డీఓ మధుసూదన్‌, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు వద్దు: విద్యాలయాలు, ఆధ్యాత్మిక మందిరాలు, ఆస్పత్రుల సమీపాల్లో మద్యం దుకాణాలు, బార్‌-రెస్టారెంట్ల ఏర్పాటుకు లైసెన్సు ఇవ్వొద్దని సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు డిమాండు చేశారు. సోమవారం కలెక్టర్‌ నాగలక్ష్మికి విన్నవించారు. ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, మహిళా సమాఖ్య నాయకులు సంతోష్‌, చిరంజీవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు