logo

గిరిజనులపై చిన్నచూపు

గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. గిరిజనులపై చిన్నచూపు ఎందుకని పలువురు ప్రశ్నించారు. ఎస్టీలకు బీఏఎస్‌ పథకం, కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వలేదన్నారు.

Published : 10 Aug 2022 05:10 IST

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు, అధికారులు

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. గిరిజనులపై చిన్నచూపు ఎందుకని పలువురు ప్రశ్నించారు. ఎస్టీలకు బీఏఎస్‌ పథకం, కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వలేదన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మంగళవారం అనంతపురంలోని సంక్షేమ భవన్‌ కార్యాలయ ప్రాంగణంలో ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ నిర్వహించారు. గిరిజన సంక్షేమ అధికారి అన్నాదొర, గిరిజన నాయకులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 1.60 లక్షల మంది గిరిజన జనాభా ఉందన్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి కనీసం జాయింట్‌ కలెక్టరు కూడా హాజరు కాలేదని సీనియర్‌ నాయకుడు శ్రీరాములు నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులు అవమానించారన్నారు. మరో నాయకుడు వీరానంద మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించాలని నిర్ణయించినా ప్రజాప్రతినిధులు, అధికారులు రాలేదని, తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహించారు. ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌ నిర్వహించకపోవడంతో సమస్యలు తీరడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఉమ, కేశవనాయక్‌, శివశంకర్‌నాయక్‌, చిరంజీవి, గోవిందు, లక్ష్మన్న, డీవీఎంసీ సభ్యుడు ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని