logo

అయ్యో పాపం అవ్వ!

ఓ వృద్ధురాలిని కొడుకు, కోడలు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక ఘటన ఇది.. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నారాయణస్వామి భవన

Published : 10 Aug 2022 05:10 IST

సామగ్రి సహా డివైడర్‌పై ఉన్న వృద్ధురాలు

తాడిపత్రి, న్యూస్‌టుడే: ఓ వృద్ధురాలిని కొడుకు, కోడలు నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక ఘటన ఇది.. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు నారాయణస్వామి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి పింఛను డబ్బు ఇవ్వాలని తరచూ గొడవ చేస్తుండేవాడు. ఇటీవల ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి రాయితీ నగదు రూ.30 వేలను తన ఖాతా నుంచి తీసుకుంది. ఆ డబ్బు కోసం వృద్ధురాలితో గొడవకు దిగిన కొడుకు, కోడలు ఆమెను ఇంటి నుంచి నెట్టేశారు. దీంతో ఆమె స్థానికుల సాయంతో ఎద్దులబండిపై తన సామగ్రి అంతా వేసుకుని తాడిపత్రి పట్టణం కూరగాయల మార్కెట్‌ వద్దకు చేరుకుని రోడ్డుపై కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తెలు వృద్ధురాలిని సాయంత్రం తమ ఇంటికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని