logo

సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం

స్వాతంత్య్ర స్ఫూర్తి భావితరాలకు దీప్తి కావాలన్నదే ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం పెడపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు చిదంబరరెడ్డి కుటుంబసభ్యులకు సన్మానం చేశారు.

Published : 10 Aug 2022 05:10 IST

పుట్టపర్తి గ్రామీణం: రమణారెడ్డిని సత్కరిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

పుట్టపర్తి గ్రామీణం: స్వాతంత్య్ర స్ఫూర్తి భావితరాలకు దీప్తి కావాలన్నదే ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం పెడపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు చిదంబరరెడ్డి కుటుంబసభ్యులకు సన్మానం చేశారు. ఆయన కుమారుడు రమణారెడ్డి కుటుంబాన్ని సత్కరించారు. ఆర్డీవో భాగ్యరేఖ, తహసీల్దార్‌ భాస్కరనారాయణ, ఎంపీడీవో అశోక్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

కదిరి పట్టణం: రెవెన్యూ అధికారులు మంగళవారం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, 1957-67 మధ్య హిందూపురం పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన కె.వి.రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామకృష్ణారెడ్డి కుమారుడు, మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ కడపల మోహన్‌రెడ్డిని సత్కరించారు. ఆర్డీవో రాఘవేంద్ర, తహసీల్దార్‌ ముకుంద పాల్గొన్నారు.

కదిరి పట్టణం: మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డికి సన్మానం

హిందూపురం అర్బన్‌: స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు చిరస్మరణీయమని పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మంగళవారం హిందూపురం పట్టణం నానెప్పనగర్‌లో నివాసం ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  అనంతరం పురపాలక సంఘం పరిధిలోని కొట్నూరు ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంట్లో నివాసమున్న స్వాతంత్య్ర సమరయోధుడు పీరూసాబ్‌ భార్యను సన్మానించారు. కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌, ఇన్‌ఛార్జి తహసీల్దారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పెనుకొండ పట్టణం : పెనుకొండలోని స్వాత్రంత్య సమరయోధుడు పంచాంగం శేషశయనం కుమారులు సుదేంద్రబాబు, నరసింహశర్మ, మనమడు సోమశేఖర్‌బాబును పెనుకొండ ఎంపీడీవో శివశంకరప్ప, తహసీల్దార్‌ స్వర్ణలత, నరపంచాయతీ కమిషనర్‌ వంశీకృష్ణభార్గవ్‌ సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని