logo

రెండేళ్లుగా పింఛను నిలిపివేత

అనంతపురం గ్రామీణ మండలం రాజీవ్‌కాలనీ పంచాయతీ పరిధిలోని మరాఠీ కాలనీలో నివసిస్తున్న ఆదివాసీ అక్కాచెల్లెళ్లు ఒంగోళి, వాణి పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కిందట వరకు వీరికి వింతతు పింఛను వచ్చేది. రెండు కుటుంబాలకు కలిపి

Published : 12 Aug 2022 04:47 IST

లెక్చరర్స్‌కాలనీ (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: అనంతపురం గ్రామీణ మండలం రాజీవ్‌కాలనీ పంచాయతీ పరిధిలోని మరాఠీ కాలనీలో నివసిస్తున్న ఆదివాసీ అక్కాచెల్లెళ్లు ఒంగోళి, వాణి పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కిందట వరకు వీరికి వింతతు పింఛను వచ్చేది. రెండు కుటుంబాలకు కలిపి ఒకే కార్డు ఉండటంతో సాంకేతిక కారణాలతో పింఛన్లను తొలగించారు. వారికి ఏ పని చేతకాక బిచ్చమెత్తుతున్నారు. ఉమ్మడిగా ఉన్న రేషన్‌కార్డు విభజించి ఏడాది గడిచినా వారికి పింఛను మాత్రం అందడం లేదు. సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదు. గతంలో ఉన్న ఐడీ కార్డు నెంబరును రద్దు చేసి కొత్త పింఛను ఇవ్వడానికి సమయం పడుతుందని వాలంటీర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో శివారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి పింఛను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని