logo

ఉప్పొంగిన దేశభక్తి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా గురువారం కదిరిలో భారీ జాతీయ పతాకాన్ని రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. కదిరిలో 2500 అడుగుల పొడవుతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించటం ఇదేప్రథమం.

Published : 12 Aug 2022 04:47 IST

కదిరిలో భారీ జాతీయ పతాక ప్రదర్శన

పట్టణ వీధుల్లో భారీ పతాకంతో ర్యాలీ

కదిరి, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా గురువారం కదిరిలో భారీ జాతీయ పతాకాన్ని రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. కదిరిలో 2500 అడుగుల పొడవుతో జాతీయ పతాకాన్ని ప్రదర్శించటం ఇదేప్రథమం. ర్యాలీ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభించారు. ప్రదర్శనలో ఆర్డీవో రాఘవేంద్ర, డీఎస్పీ భవ్యకిశోర్‌, రోటరీక్లబ్‌ సభ్యులు, ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొని 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకలపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ముకుంద, ఎంఈవో చెన్నకృష్ణ, రోటరీక్లబ్‌ సహాయ గవర్నర్‌ రాఘవేంద్ర, అధ్యక్ష కార్యదర్శులు రంజిత్‌ పృథ్వీరాజ్‌, నితిన్‌, అనిల్‌కుమార్‌, మదన్‌కుమార్‌, తాహిర్‌వలి, ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని