logo

వాడవాడలా .. మువ్వన్నెల జెండా

గుంతకల్లు పట్టణంలో 75వ స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో

Published : 13 Aug 2022 04:41 IST

గుంతకల్లు పట్టణంలో జాతీయ జెండాలతో రోటరీ స్కూలు విద్యార్థుల ప్రదర్శన

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: గుంతకల్లు పట్టణంలో 75వ స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో భారీగా ప్రదర్శన చేశారు. పాఠశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా గాంధీ చౌక్‌ వరకు ర్యాలీ కొనసాగింది. పలువురు గాంధీజీ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ నెల 15న ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బాలబాలికల దేశ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ప్రైవేటు కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని