logo

జేఎన్‌టీయూ ముట్టడి ఉద్రిక్తం

జేఎన్‌టీయూ అధికారులు బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులపై కక్ష సాధిస్తున్నారని విమర్శిస్తూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం

Published : 13 Aug 2022 04:41 IST

తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ అధికారులు బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులపై కక్ష సాధిస్తున్నారని విమర్శిస్తూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చారు. శారదానగర్‌ నుంచి తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ర్యాలీగా చేరుకుని ప్రధానద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు అడ్డుకుంటున్నా గేట్లెక్కి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలుగుయువత వెంకటప్ప, నారాయణస్వామి, సుధాకర్‌యాదవ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ లక్ష్మీనరసింహ, గుత్తా ధనుంజయ, బండి పరశురాం, శివ, చంద్రఓబుళరెడ్డి, నరేష్‌, భరత్‌, ప్రశాంత్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో బాధ్యతగల హోదాలో ఉంటున్న ఉపకులపతులు, రెక్టార్లు, రిజిస్ట్రార్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వత్తాసు పలుకుతూ, వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బడుగు, బలహీన వర్గాల ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. అనంతరం నాయకులను పోలీసులు స్టేషనుకు తరలించి, కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని