logo
Published : 13 Aug 2022 04:41 IST

2.58 లక్షల జెండాలు సరఫరా

జెండాలను పరిశీలిస్తున్న సీఈవో కేశవనాయుడు, పీడీలు నరసింహారెడ్డి, విజయలక్ష్మి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన 2.58 లక్షల త్రివర్ణ పతాకాలు జిల్లాకు చేరాయి. శుక్రవారం తిరుపతి నుంచి ప్రత్యేక వాహనంలో కలెక్టర్‌ కార్యాలయానికి చేరిన  2,58,487 పతాకాలను ఆన్‌సెట్‌ సీఈవో కేశవనాయుడు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు నరసింహారెడ్డి, విజయలక్ష్మి పరిశీలించారు. పట్టణ, మండలాల వారీగా పంపిణీ చేసే బాధ్యతను ఆ రెండు ప్రాజెక్టుల పీడీలకు అప్పగించారు. మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవోలు వారికి కేటాయించిన జెండాలను తీసుకెళ్లారు. వీటిని నిర్దేశిత గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుస్తారు. అక్కడి నుంచి వాలంటీర్లు శనివారం విధిగా సామాజిక పింఛను, చేయూత లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈనెల 13 నుంచి 15వ తేదీల్లో ఇంటింటా మువ్వన్నెల పతాకం రెపరెపలాడాల్సి ఉంటుంది.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని