logo

విష జ్వరాల బారిన కస్తూర్బా విద్యార్థినులు

మండలంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు. వారం రోజులుగా సోలార్‌ వేడి నీటి యంత్రాలు పనిచేయడం లేదు.

Published : 13 Aug 2022 04:41 IST

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పాపిరెడ్డిపల్లి కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థినులు జ్వరాల బారిన పడ్డారు. వారం రోజులుగా సోలార్‌ వేడి నీటి యంత్రాలు పనిచేయడం లేదు. చన్నీటితోనే స్నానాలు చేస్తుండటంతో మొదట జలుబు, దగ్గు ఆపై జ్వరాల బారిన పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు రవీంద్ర, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు గంగమ్మ, శారదాబాయి మందులు అందజేసినా.. నయం కాకపోవడంతో పలువురు విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. ఇప్పటివరకు 30 మందిని ఇళ్లకు పంపించామని, కొందరికి జ్వరం నయం కావడంతో మళ్లీ కస్తూర్బాకు వచ్చారని ఎస్‌వో అనిత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని