logo

ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో  ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 13 Aug 2022 04:41 IST

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో  ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలతోపాటు జిల్లాలోని 32 మండలాల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1.50 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేశామన్నారు. శనివారం మరో 80 వేలు పంపిణీ చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ పరిధిలోని గ్రామ, పట్టణంలో జెండా ఎగురవేసేలా చూడాలన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా హోర్డింగ్స్‌ని కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు