logo

అమృతోత్సవానికి సర్వం సిద్ధం

75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంత నగరం కోర్టురోడ్డులోని పోలీసు పరేడ్‌ మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. జిల్లాలోని వెంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు

Published : 15 Aug 2022 05:22 IST

సుందరంగా పోలీసు పరేడ్‌ మైదానం

వేదిక చుట్టూ ఆలంకరణ

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అనంత నగరం కోర్టురోడ్డులోని పోలీసు పరేడ్‌ మైదానాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. జిల్లాలోని వెంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు హాజరు కానున్నారు. ఏ సమస్య, లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రంగులతో ముగ్గులు వేశారు. ఇదే క్రమంలోనే ప్రధాన వేదికకు ఇరువైపులా వీఐపీలు ఆశీనులయ్యే గ్యాలరీలను సిద్ధం చేశారు. నిర్ధేశిత శాఖలు తమ సంక్షేమ పథకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు శాఖ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. ఉత్సవాల ఇన్‌ఛార్జి, అనంతపురం ఆర్డీవో మధుసూదన్‌తో కలిసి ఏర్పాట్లను జేసీ కేతన్‌గార్గ్‌ పర్యవేక్షించారు. అంతకముందు ఆర్డీవో తమ పరిధిలోని తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని