logo

చిరుధాన్యాలపై జాతీయ స్ఫూర్తి

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా లేపాక్షి మండలం ఉప్పరపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు సుధాకర్‌ తన నైపుణ్యంతో ఎటువంటి రంగులు అద్దకుండా సహజమైన ఎర్రజొన్నలు, బియ్యం, పెసలు వంటి చిరు ధాన్యాలతో జాతీయ జెండా చిత్రపటాన్ని తయారుచేసి మధ్యలో అశోక చక్రం గీశారు. గింజలు పాడవకుండా ఎక్కువకాలం ఉండాలనే

Published : 15 Aug 2022 05:22 IST

చిరుధాన్యాలతో తయారు చేసిన జాతీయ జెండా

లేపాక్షి, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా లేపాక్షి మండలం ఉప్పరపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు సుధాకర్‌ తన నైపుణ్యంతో ఎటువంటి రంగులు అద్దకుండా సహజమైన ఎర్రజొన్నలు, బియ్యం, పెసలు వంటి చిరు ధాన్యాలతో జాతీయ జెండా చిత్రపటాన్ని తయారుచేసి మధ్యలో అశోక చక్రం గీశారు. గింజలు పాడవకుండా ఎక్కువకాలం ఉండాలనే ఉద్దేశంతో ‘ఫార్మాలిన్‌ డీహైడ్రెడ్‌’ ద్రావణంలో కలిపి అతికించారు. ఎర్ర జొన్నలు ఉన్న పైభాగంలో తెలుగులో వందేమాతర గీతాన్ని, బియ్యం ఉన్న మధ్య భాగంలో ఆంగ్లంలో ఓ పక్క ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, 75వ సంవత్సర స్వాతంత్య్ర దిన వేడుకలు అని, మరో పక్క ఫ్లెడ్జ్‌, పెసలు ఉన్న చివరి భాగంలో హిందీలో జనగణమన అని జాతీయ గీతాన్ని రోటరింగ్‌ ఇంక్‌ ద్వారా రాశారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని