logo

‘ఎంపీ మాధవ్‌ వీడియోపై నిజాలను నిగ్గు తేల్చాలి’

ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన నిర్వాకాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆయన వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ అనుబంధం

Published : 15 Aug 2022 05:22 IST

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన నిర్వాకాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆయన వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్‌ చేసింది. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ అనుబంధం ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాద్‌, పద్మావతి మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళా చట్టాలను సమర్థంగా అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: న్యూడ్‌ వీడియోను ప్రదర్శించడమే కాకుండా కులాల మధ్య ఎంపీ గోరంట్ల మాధవ్‌ చిచ్చు పెట్టారని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాశ్‌నాయుడు విమర్శించారు. ‘గోరంట్ల మాధవ్‌ గోబ్యాక్‌’ అంటూ ఆదివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రకాశ్‌నాయుడును పోలీసులు అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ చేసిన తప్పును ఒప్పుకోకుండా మళ్లీ ఊరేగింపుగా ఏదో ఘన కార్యం సాధించిన రీతిలో వ్యవహరించడం శోచనీయం అన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామి, దివాకర్‌నాయుడు, చంద్రశేఖర్‌నాయుడు, శ్రీనివాస్‌చౌదరి, అలీఖాన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని