logo

యంత్రాలు కొన్నారు.. అద్దె చెల్లించలేక మూతేశారు!

జిల్లాలో విస్తారంగా టమోటా పండుతోంది. ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంపీ రంగయ్య ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో చర్చించి, ప్రత్యామ్నాయంగా ప్రాసెస్‌ యూనిట్‌ ఏర్పాటుకు చొరవ చూపారు.

Published : 17 Aug 2022 03:54 IST

టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ పరిశీలిస్తున్న ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి (పాతచిత్రం)

జిల్లా వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో విస్తారంగా టమోటా పండుతోంది. ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో ఎంపీ రంగయ్య ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో చర్చించి, ప్రత్యామ్నాయంగా ప్రాసెస్‌ యూనిట్‌ ఏర్పాటుకు చొరవ చూపారు. మైiసూరు డిఫెన్స్‌ ఫుడ్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తల బృందాన్ని జిల్లాకు రప్పించారు. వారి సాంకేతిక సహకారంతో ఉద్యాన, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్టు ఏర్పాటుకు గోదామును ఆధునికీకరించారు. రూ.10 లక్షలతో యంత్ర పరికరాలు సమకూర్చారు. ఎంపీ రంగయ్య తన నిధులు రూ.7.50 లక్షలు, మార్కెటింగ్‌శాఖ రూ.2.50 లక్షలు వెచ్చించి టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్టును నెలకొల్పారు. ఈఏడాది మార్చి 30న ప్రారంభించారు. నిర్వహణ బాధ్యతను వేదభూమి రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగించారు. సంఘ సభ్యులకు మైసూరులో మూడ్రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఒక్కరోజు కూడా యూనిట్టు పనిచేసిన దాఖలాలు లేవు. ఈ కేంద్రానికి నెలకు అద్దె రూ.15 వేలు చెల్లించాలని యార్డు అధికారులు డిమాండు చేసినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. అద్దె పెచీతోనే నాలుగు నెలలుగా మూతపడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటం చేసి గాలికొదిలేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానశాఖ అధికారి రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అద్దె సమస్య ఉంది. మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాను. త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని