logo

సర్వేయర్లకు పదోన్నతి

పదోన్నతుల కోసం రెండున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మండల సర్వేయర్ల కల ఎట్టకేలకు సాకారమైంది. వారికి పదోన్నతులు కల్పిస్తూ  కమిషనర్‌ ఆఫ్‌ సర్వే, సెటిల్‌మెంట్స్‌, అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు,

Published : 17 Aug 2022 03:54 IST

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: పదోన్నతుల కోసం రెండున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మండల సర్వేయర్ల కల ఎట్టకేలకు సాకారమైంది. వారికి పదోన్నతులు కల్పిస్తూ  కమిషనర్‌ ఆఫ్‌ సర్వే, సెటిల్‌మెంట్స్‌, అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు, ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 మందికి పదోన్నతులు అందుకున్నారు. వీరిలో 1998, 2008 బ్యాచ్‌కి చెందినవారు ఉన్నారు. ఉత్తర్వులు అందిన పదిహేను రోజుల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేయర్లు ఒకే కేడర్‌లో 24 ఏళ్లపాటు పనిచేశారు. ఆ సంఘం పోరాటం, రీ-సర్వే ఫలితంగా పదోన్నతులు వరించాయి. గతంలో డివిజన్‌కు ఒక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే పోస్టు ఉండేది. పోస్టులు అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం డివిజన్‌కు ఇద్దరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో కంబదూరులో పనిచేసే నాగరాజు, గార్లదిన్నె వేణుగోపాలగుప్తా, ఆత్మకూరు సుబ్రహ్మణ్యం, రాప్తాడు అంజలీదేవీ, డీ.హీరేహాళ్‌ సూర్యనారాయణరెడ్డి, అగళి శామ్యేల్‌బాబు, ధర్మవరం అంజినప్పలకు పదోన్నతుల ఉత్తర్వులు అందినట్లు శ్రీసత్యసాయి జిల్లా సర్వే విభాగం ఏడీ రామకృష్ణన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని