logo

రవాణాశాఖ ఆకస్మిక తనిఖీలు

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు యజమానులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన సామగ్రిని రవాణా చేస్తున్నట్లు  మంగళవారం జరిపిన తనిఖీలో గుర్తించామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శివరామ ప్రసాద్‌ తెలిపారు. 46 కేసులు నమోదు చేసి,

Published : 17 Aug 2022 03:54 IST

46 కేసులు.. రూ.6 లక్షల జరిమానా వసూలు

అరవిందనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు యజమానులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన సామగ్రిని రవాణా చేస్తున్నట్లు  మంగళవారం జరిపిన తనిఖీలో గుర్తించామని రవాణాశాఖ ఉప కమిషనర్‌ శివరామ ప్రసాద్‌ తెలిపారు. 46 కేసులు నమోదు చేసి, రూ.6 లక్షలు అపరాధ రుసుం విధించామన్నారు. పర్మిట్‌ తీసుకోకుండా ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సును సీజ్‌ చేశామన్నారు. నిబంధనల మేరకు బస్సుల్లో ప్రయాణికుల లగేజీని మాత్రమే తీసుకెళ్లాలనే నిబంధన ఉందని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని