logo

గుట్టలుగా ప్లాస్టిక్‌

పట్టణంలో ప్లాస్టిక్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొందరు వ్యాపారులు తమ దుకాణాల్లో ప్రత్యేకంగా రహస్య గదులు ఏర్పాటు చేసుకొని  గుట్టలుగా ప్లాస్టిక్‌ కవర్లు దాచి విక్రయిస్తున్నారు. మంగళవారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు

Published : 17 Aug 2022 03:54 IST

రహస్య గదిలో దాచి విక్రయాలు


దుకాణంలో పట్టుబడిన ప్లాస్టిక్‌ కవర్లు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో ప్లాస్టిక్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కొందరు వ్యాపారులు తమ దుకాణాల్లో ప్రత్యేకంగా రహస్య గదులు ఏర్పాటు చేసుకొని  గుట్టలుగా ప్లాస్టిక్‌ కవర్లు దాచి విక్రయిస్తున్నారు. మంగళవారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి గాంధీ సర్కిల్‌లోని పలు దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో పవన్‌ పేపర్‌ కప్స్‌ దుకాణంపై దాడి చేశారు. ప్లాస్టిక్‌ కవర్లు దొరకకపోవడంతో అనుమానం వచ్చి మరింతగా సోదాలు చేశారు. రహస్య గదిలో దాచిన ప్లాస్టిక్‌ కవర్లు బయటపడ్డాయి. ఏకంగా ఓ ట్రాక్టర్‌ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం అధికార పార్టీ నాయకులకు వెళ్లడంతో వదిలేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చాయి. కమిషనర్‌ పట్టుదలగా వ్యవహరించి ప్లాస్టిక్‌ను ట్రాక్టర్‌తో మున్సిపాలిటీకి తరలించారు. రూ.20 వేలు మాత్రమే జరిమానా విధించడం వెనుక నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ మొదటిసారి కావడంతో రూ.20వేలు జరిమానా విధించామని, మరోసారి దొరికితే రూ.లక్ష విధిస్తామని, ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదని, పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని పేర్కొన్నారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts