logo

అన్యాయం జరిగిందని దంపతుల ఆత్మహత్యాయత్నం

ఇంటి పట్టా మంజూరు విషయంలో తమకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో పరిగి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం... పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన జయమ్మ,

Published : 17 Aug 2022 03:54 IST

ఆత్మహత్యకు యత్నిస్తున్న దంపతులను అడ్డుకుంటున్న పోలీసులు

పరిగి, న్యూస్‌టుడే: ఇంటి పట్టా మంజూరు విషయంలో తమకు అన్యాయం జరుగుతుందన్న ఆవేదనతో పరిగి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం... పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన జయమ్మ, నరసింహప్ప దంపతులు 30 ఏళ్ల కిందట గ్రామ ఎస్సీకాలనీ సమీప ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకుని జీవనం సాగించేవారు. ప్రమాదవశాత్తు ఆ గుడిసె కాలిపోవడంతో ఆ స్థలాన్ని ఖాళీ చేసి మరో చోట ఉంటున్నారు. గతంలో తాము నివసించిన గుడిసెకు సంబంధించి ఇంటి పన్ను చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై ఏడాది కాలంగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమ గోడును అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వారు పరిగి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మంగళవారం తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మీ మాట్లాడుతూ గ్రామ కంఠంలోని ఈ స్థలం వివాదస్పదంగా ఉందన్నారు. కోర్టు ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించామని ఆమె తెలిపారు. భూమిపై హక్కులు ఉన్నట్లు బాధితులు సరైన రికార్డులు సమర్పిస్తే తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts