logo

జగనన్న కాలనీలో ఊట

మండలంలోని న్యామద్దల గ్రామంలోని జగనన్న కాలనీ వర్షాలకు జౌకె (ఊట)క్కింది. ఇక్కడ 350 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించగా ఇప్పటి వరకు ఒకే ఇంటి నిర్మాణం పూర్తయ్యింది.

Published : 27 Sep 2022 03:08 IST

న్యామద్దల (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: మండలంలోని న్యామద్దల గ్రామంలోని జగనన్న కాలనీ వర్షాలకు జౌకె (ఊట)క్కింది. ఇక్కడ 350 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించగా ఇప్పటి వరకు ఒకే ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. కొందరు లబ్ధిదారులు పునాదులు తవ్వుకున్నారు. వర్షం కురవడంతో నీరు నిలిచింది. ఊటెక్కిన ప్రాంతంలో పునాదులు పూడిపోయాయి. ఊట నీటిని గమనించిన పలువురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వనంలో స్థలాలు కేటాయించడంతోనే ఇలాంటి దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోచోట స్థలాలు కేటాయించేందుకు అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని