logo

అనుగృహం ఎన్నడో..!

పైపులు బిగిస్తున్న సిబ్బందిధర్మవరం, న్యూస్‌టుడే : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ధర్మవరంలో నిర్మిస్తున్న గృహాలు ఐదేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్నాయి. పట్టణ శివారులోని ఇందిరమ్మ...

Published : 27 Sep 2022 03:08 IST


నత్తనడకన నిర్మాణాలు

పైపులు బిగిస్తున్న సిబ్బందిధర్మవరం, న్యూస్‌టుడే : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ధర్మవరంలో నిర్మిస్తున్న గృహాలు ఐదేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్నాయి. పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు చేసే గుత్తేదారు మారారు. 30 బ్లాక్‌లలో ఒక్కొక్క బ్లాక్‌లో 48 గృహాలు చొప్పున మొత్తం 1440 నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు బ్లాక్‌లలో మాత్రమే  పనులు తుది దశకు చేరాయి. ప్రస్తుతం  గృహాలకు రంగులు వేస్తున్నారు. పైపులు బిగిస్తున్నారు. తలుపులు  బిగించలేదు. నీటి వసతి కల్పించలేదు. నిర్మాణ పనుల్లో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో టిడ్కో గృహాలు ఎప్పుడు పూర్తవుతాయో.. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. టిడ్కో గృహాల పంపిణీ త్వరలో అంటూ పలుమార్లు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు.

* ధర్మవరంలో 300 చదరపు అడుగుల బ్లాక్‌లో ఒక్కో గృహం రూ.2.65 లక్షలతో నిర్మాణం చేపట్టారు. లబ్ధిదారులు మొదట రూ.500 చెల్లించారు. 1440 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలను ఇవ్వనున్నారు. నిర్మాణం పూర్తయిన బ్లాక్‌లలో తుది పనులు జరుగుతున్నాయి. మిగతా  27 బ్లాక్‌లలో పనులు నత్తనడకన సాగున్నాయి. ఇలాగే సాగితే మరో ఏడాది అయ్యే పరిస్థితి ఉంది.

మౌలిక సదుపాయాల ఊసే లేదు..
టిడ్కో గృహసముదాయాల ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించలేదు. మురుగు కాలువలు, రహదారుల పనులే ప్రారంభం కాలేదు. తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టాలి. స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సి ఉంది.


ధర్మవరంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలు

రిజిస్ట్రేషన్‌ జరుగుతోంది
టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 482 మంది ఇళ్ల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశాం. రూ.1కే లబ్ధిదారులకు గృహాలను ప్రభుత్వం ఇవ్వనుంది. మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాల్సి ఉంది.

- మల్లికార్జున, పురపాలక కమిషనర్‌, ధర్మవరం

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని