logo

ఎంపీడీవోపై ఎమ్మెల్సీ ఆగ్రహం

వాలంటీరు నియామకంలో ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో నాలుగు....

Published : 27 Sep 2022 06:12 IST


ఎంపీడీవో(నలుపురంగు చొక్కా)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ శివరామిరెడ్డి

వజ్రకరూరు, న్యూస్‌టుడే: వాలంటీరు నియామకంలో ఎంపీడీవో తీరుపై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో నాలుగు నెలల కిందట వాలంటీరు పోస్టుకు మండలపరిషత్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన హమీద్‌ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. రాజకీయ కారణాలతో నియామకాన్ని పూర్తి చేయలేదు. ఈ క్రమంలో అభ్యర్థి .. ఎంపీడీవో చంద్రమౌళి తనను రూ.20వేలు డిమాండు చేశారంటూ స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. డబ్బు డిమాండు చేయలేదని, రాజకీయ కారణాలతో నియామకం చేపట్టలేదని ఎంపీడీవో వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం అభ్యర్థి కార్యాలయానికి గ్రామస్థులతో కలిసి వచ్చాడు. రిజర్వేషన్‌ మారే అవకాశాలున్నాయని ఎంపీడీవో తెలిపారు. ఈ విషయం ఎమ్మెల్సీ దృష్టికి వెళ్లగా ఆయన కార్యాలయానికి చేరుకొని 4 గంటలపాటు అక్కడే ఉన్నారు. రాజకీయంగా ఎవరు అడ్డు పడుతున్నారో తెలియజేయాలని ఎంపీడీవోపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచగొండితనాన్ని కాపాడుకోవడానికి నాయకులను అడ్డుపెట్టుకుంటావా అని మండిపడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ అనుచరులు గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని