logo

దళిత భూములు లాక్కుంటే ఊరుకోం

రాష్ట్రంలో అంబేడ్కర్‌ విగ్రహాలు పెట్టడానికి అనుమతి,  తీర్మానాలు అవసరం లేదని ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. 

Published : 02 Oct 2022 02:58 IST

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌తో కలెక్టరు నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అంబేడ్కర్‌ విగ్రహాలు పెట్టడానికి అనుమతి,  తీర్మానాలు అవసరం లేదని ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా కలెక్టరు నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. పలు ఎస్సీ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం రోడ్లు భవనాల అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్‌ భూములు లాక్కోవడం, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలపై వేధింపులు తదితర సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో దళిత భూములు ఆక్రమిస్తే, దాడులు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

* శ్మశానవాటికలు లేక ఎస్సీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తగు చర్యలు చేపట్టాలని ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ను ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, కుళ్లాయప్ప కోరారు.

* బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని పలువురు వార్డెన్లు విన్నవించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని