logo

విలువైన స్థలంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దు

తాడిపత్రి పురపాలికకు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ అవసరమే కానీ ఆదాయాన్ని పెంచే విలువైన స్థలంలో కాకుండా మరొక చోట ఏర్పాటు చేయాలని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ కూడలి సమీపంలో శనివారం ఆయన నల్లదుస్తులు ధరించి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

Published : 02 Oct 2022 02:58 IST

నల్లదుస్తులు ధరించి నిరాహార దీక్ష చేస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పురపాలికకు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ అవసరమే కానీ ఆదాయాన్ని పెంచే విలువైన స్థలంలో కాకుండా మరొక చోట ఏర్పాటు చేయాలని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ కూడలి సమీపంలో శనివారం ఆయన నల్లదుస్తులు ధరించి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లోనే పట్టణంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు స్థల సేకరణ చేసి ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. అక్కడ నిర్మాణం చేయకుండా రద్దీగా ఉన్న గాంధీ కూడలిలో ఏర్పాటు చేస్తే పోలీసుల విధులకు అంతరాయం కలుగుతుందన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాన్ని ఇతర శాఖలకు ఇవ్వడం అసాధ్యమని, ఆదాయాన్ని పెంచేందుకు వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాటలు విని, డీఎస్పీ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు కుతూహలంగా ఉన్నాడని పేర్కొన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద ట్రాఫిక్‌ స్టేషన్‌ నిర్మించే ఆలోచన మానుకోకుంటే కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు కూర్చుంటామని జేసీ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని