logo

నూతన ఆవిష్కరణ వైపు దృష్టి సారించండి

యువత నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగరాజన్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో పుట్టపర్తి చేరుకున్నారు. శాంతిభవన్‌ అతిథి గృహం వద్ద ట్రస్టు వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి.

Published : 02 Oct 2022 02:58 IST

మాట్లాడుతున్న ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగరాజన్‌

పుట్టపర్తి, న్యూస్‌టుడే: యువత నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగరాజన్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన బెంగళూరు నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో పుట్టపర్తి చేరుకున్నారు. శాంతిభవన్‌ అతిథి గృహం వద్ద ట్రస్టు వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. సత్యసాయి విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సుందరస్వామి మెమోరియల్‌ లెక్చర్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విలువల విద్యాబోధన, సంఘసేవకులుగా తీర్చిదిద్ది, సమాజానికి అందించడం అభినందనీయమన్నారు. పరిశోధనల వైపు వారితో అడుగులేసేలా పరిశోధకులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆయనను ఛాన్సలర్‌ చక్రవర్తి, ట్రస్టు సభ్యులు నాగానంద, తదితరులు ఘనంగా సన్మానించారు. శాంతి భవన్‌ అతిథి గృహంలో ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రంగరాజన్‌ రాత్రికి శాంతిభవన్‌ అతిథి గృహంలో బసచేసి ఆదివారం ఉదయం మహాసమాధిని దర్శించుకొని బెంగళూరుకు వెళ్లనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని