logo

గుడారానికో సౌరపలకం..

సాంకేతికతలో వస్తున్న మార్పులను సామాన్యులు సైతం అందుకుంటున్నారు. గార్లదిన్నె మండలం పెనకచర్ల జలాశయం సమీప ప్రాంతాల్లో మేత బాగా దొరుకుతుండటం వల్ల జిల్లా నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి వర్షాకాలంలో ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు.

Published : 03 Oct 2022 05:14 IST

గుడారాల పైన ఏర్పాటు చేసుకున్న సౌరపలకాలు

సాంకేతికతలో వస్తున్న మార్పులను సామాన్యులు సైతం అందుకుంటున్నారు. గార్లదిన్నె మండలం పెనకచర్ల జలాశయం సమీప ప్రాంతాల్లో మేత బాగా దొరుకుతుండటం వల్ల జిల్లా నలుమూలల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి వర్షాకాలంలో ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. గతంలో వీరు దీపాల వెలుగుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు. సాంకేతికత మార్పులను అందిపుచ్చుకుని ప్రతి గుడారానికి ఒక సౌరపలకం ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా వచ్చే విద్యుత్తుతో రాత్రివేళలో చీకట్లో మగ్గిపోకుండా బల్బు వెలిగించుకోవటమే కాకుండా చరవాణుల ఛార్జింగ్‌కు సైతం ఉపయోగించుకుంటున్నారు. సౌరవిద్యుత్తు కాంతుల వల్ల అటవి జంతువుల నుంచి తమకు, గొర్రెలకు బెడద తప్పిందని కాపరులు తెలిపారు. సౌరపలకానికి రూ.4,500 ఖర్చు అయినప్పటికీ ఎంతో ఉపయుక్తంగా ఉందని చెబుతున్నారు.

- ఈనాడు, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని