logo

యథావిధిగా వాహనాల రాకపోకలు

‘తాత్కాలిక రహదారి కోత.. రాకపోకలకు వ్యధ’ శీర్షికన గత నెల 15న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, గుత్తేదారు స్పందించారు. కొడికొండ నుంచి శిర వెళ్లే జాతీయ రహదారిలో పరిగి చెరువు మరువ వంక వద్ద బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు.

Published : 03 Oct 2022 05:14 IST

పరిగి, న్యూస్‌టుడే: ‘తాత్కాలిక రహదారి కోత.. రాకపోకలకు వ్యధ’ శీర్షికన గత నెల 15న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, గుత్తేదారు స్పందించారు. కొడికొండ నుంచి శిర వెళ్లే జాతీయ రహదారిలో పరిగి చెరువు మరువ వంక వద్ద బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు. గతంలో వచ్చిన వదరలకు తాత్కాలిక రహదారి కొట్టుపోయింది. స్పందించిన అధికారులు, గుత్తేదారు పైపులు ఏర్పాటు చేసి మట్టితో చదును చేసి రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయించడంతో ఆదివారం నుంచి వాహన రాకపోకలు యథావిధిగా ప్రయాణిస్తున్నాయి.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts