logo

బస్సులో వైద్య విద్య!

ఆధునిక వైద్య పరిజ్ఞానంలో భాగంగా శస్త్ర చికిత్సల్లో మెలకువలు నేర్పడానికి వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కోత, కుట్టు లేకుండా చర్మం పూర్తిగా తెరవకుండా రెండు చిన్నటి యంత్రాలను శరీర భాగాల్లోకి పంపి ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్ర చికిత్స చేస్తున్నారు.

Published : 03 Oct 2022 05:14 IST

యువ వైద్యుల్లో శస్త్రచికిత్స నైపుణ్యం పెంపు

ల్యాప్రోస్కోపి విధానంతో నేర్చుకుంటున్న వైద్యురాలు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ఆధునిక వైద్య పరిజ్ఞానంలో భాగంగా శస్త్ర చికిత్సల్లో మెలకువలు నేర్పడానికి వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కోత, కుట్టు లేకుండా చర్మం పూర్తిగా తెరవకుండా రెండు చిన్నటి యంత్రాలను శరీర భాగాల్లోకి పంపి ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్ర చికిత్స చేస్తున్నారు. వీటిపై యువ వైద్యుల్లో అవగాహన పెంచడానికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఓ సంచార బస్సులో వైద్యవిద్య నేర్పుతున్నారు. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించి ల్యాప్రోస్కోపి విధానంలో శస్త్ర చికిత్స ఎలా చేయాలో విశదీకరిస్తున్నారు. వీటిని ఓ యంత్రం సహాయంతో నేర్పడానికి ఈ బస్సులో ఐదు యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఉన్న ల్యాప్రోస్కోపి యంత్రాలతో శరీర భాగంలో ఎలా శస్త్ర చికిత్స చేయాలి.. కోత ఎలా పెట్టాలి.. కుట్టు ఎలా వేయాలి.. వాటి ముడి ఏ విధంగా వేయాలో యువ వైద్యులకు శిక్షణ ఇచ్చారు. అనంతపురం వైద్య కళాశాలలోని ప్రొఫెసర్లు యువ వైద్యులు, విద్యార్థులతో కుట్లు వేయడంలో శిక్షణ ఇచ్చారు.

30 రోజులు 8 కళాశాలలు..

యువ వైద్యులకు శస్త్ర చికిత్సలో నైపుణ్యం పెంచడానికి ఏర్పాటు చేసిన సంచార బస్సు సెప్టెంబరు 3వ తేదీన రాష్ట్రంలోకి చేరుకుంది. అక్టోబరు 2వ తేదీ వరకు 30 రోజుల్లో 8 వైద్య కళాశాలలను పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. ఒక్కో కళాశాలలో మూడు రోజుల పాటు ఈ బస్సు అందుబాటులో ఉంటూ యువ వైద్యులకు అవగాహన కల్పించారు. 8 కళాశాలల్లో 4 వేల మంది శస్త్ర చికిత్సలపై అవగాహన పొందారని నిర్వాహకులు తెలిపారు.


గట్టి ముడి ఇలా వేయాలి..


ఎంతో ఉపయోగం

శస్త్రచికిత్సపై అవగాహన పెంచుకోవడానికి, నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

- డాక్టర్‌ పద్మశ్రీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌


భయం పోయింది..

ల్యాప్రోస్కోపి ద్వారా కుట్లు నేర్చుకుంటుంటే రోగికి శస్త్ర చికిత్స చేస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. ల్యాప్రోస్కోపి పరికరాలతో నేర్చుకోవడం యువ వైద్యులకు ఎంతో అవసరం. కుట్లు వేయడంలో భయం ఉండేది. ప్రస్తుతం పోయింది.

- డాక్టర్‌ రాణి, గుంటూరు


కుట్లు వేయడం నేర్చుకున్నా..

కుట్లు ఎలా వేయాలో నిర్వాహకులు చక్కగా వివరించారు. ముడి వేయడంలో అనుభవం లేకపోతే శస్త్రచికిత్స అనంతరం రోగికి పుండు అయ్యే అవకాశం ఉంటుంది. వైద్యురాలికి అనుభవం లేదని చెబుతారు.

- డాక్టర్‌ రింద, సీనియర్‌ రెసిడెన్సీ, హైదరాబాద్‌

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts