logo

ప్రజాపోరుయాత్రలో ఉద్రిక్తత

భాజపా నిర్వహిస్తున్న ప్రజాపోరుయాత్రను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న ఘటన బొమ్మనహాళ్‌ మండలంలో చోటుచేసుకుంది. భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు వసుంధర, కిసాన్‌మోర్చ నాయకుడు హీరోజీరావు తదితరులు ఆదివారం దేవరిగిలో ప్రజాపోరుయాత్ర ప్రారంభించారు.

Published : 03 Oct 2022 05:14 IST

అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు

యాత్రను అడ్డుకుంటున్న వైకాపా కార్యకర్తలు

దేవగిరి (బొమ్మనహాళ్‌), న్యూస్‌టుడే: భాజపా నిర్వహిస్తున్న ప్రజాపోరుయాత్రను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న ఘటన బొమ్మనహాళ్‌ మండలంలో చోటుచేసుకుంది. భాజపా జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారధి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యురాలు వసుంధర, కిసాన్‌మోర్చ నాయకుడు హీరోజీరావు తదితరులు ఆదివారం దేవరిగిలో ప్రజాపోరుయాత్ర ప్రారంభించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు రాజకుమార్‌, కార్యకర్తలు రుద్ర, శేఖర్‌, రాము, వన్నమ్మ తదితరులు అక్కడికొచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని వాదనకు దిగారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. మైకులు, సెల్‌ఫోన్లను వైకాపా కార్యకర్తలు లాక్కున్నారని భాజపా నాయకులు తెలిపారు. పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్లు తిరిగి అప్పగించారు. వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ తెలిపారు.

మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధిలేదు.. మద్యపాన నిషేధంపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. గాంధీ జయంతి రోజునే వైకాపా నాయకులు మద్యం మత్తులో ప్రజాపోరుయాత్రను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని