logo

చిత్రావతి పరవళ్లు.. ఆగిన రాకపోకలు

యల్లనూరు మండలంలోని శింగవరం, యల్లనూరు వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున ఆదివారం పార్నపల్లి డ్యామ్‌ నుంచి 4200 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. దీంతో యల్లనూరు మండలంలోని చిత్రావతి పరివాహక ప్రాంతాల్లో నీరు భారీగా పారుతోంది.

Published : 04 Oct 2022 02:35 IST

శింగవరం వద్ద తెగిపోయిన వంతెన

యల్లనూరు(పుట్లూరు), న్యూస్‌టుడే: యల్లనూరు మండలంలోని శింగవరం, యల్లనూరు వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన వర్షాలు కురుస్తున్నందున ఆదివారం పార్నపల్లి డ్యామ్‌ నుంచి 4200 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. దీంతో యల్లనూరు మండలంలోని చిత్రావతి పరివాహక ప్రాంతాల్లో నీరు భారీగా పారుతోంది. ప్రవాహం ధాటికి శింగవరం వద్ద వంతెన తెగిపోయి పులివెందుల, తదితర ప్రాంతాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నెల రోజుల క్రితం ఇలాగే వంతెన తెగిపోయి రవాణాకు ఆటంకం కలిగిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని