logo

తత్కాల్‌ టికెట్లలో దళారుల దందా!

ఏం నిదానంగా పనిచేస్తున్నారు.. వేగం పెంచండి. ఇలాగైతే మిమ్మల్ని బదిలీ చేయిస్తా. నాకు పైస్థాయిలో పలుకుబడి ఉంది. యంత్రాలు పని చేయకపోతే కొత్తవి మంజూరు చేయిస్తా.. నా గురించి తెలుసుకోండి.

Published : 04 Oct 2022 02:35 IST

ఏం నిదానంగా పనిచేస్తున్నారు.. వేగం పెంచండి. ఇలాగైతే మిమ్మల్ని బదిలీ చేయిస్తా. నాకు పైస్థాయిలో పలుకుబడి ఉంది. యంత్రాలు పని చేయకపోతే కొత్తవి మంజూరు చేయిస్తా.. నా గురించి తెలుసుకోండి

- అనంత రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌లో సోమవారం ఓ దళారీ హల్‌చల్‌

అనంతపురం రైల్వే స్టేషన్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద బారులు

స్టేషన్‌లోనే తిష్ఠ
అనంతపురం, ధర్మవరం, కల్లూరు రైల్వే స్టేషన్లలో దళారులు అధికమయ్యారు. అనంతపురంలో రద్దీ అధికంగా ఉంటే కల్లూరుకు వెళ్లి టికెట్లను తెచ్చుకుంటున్నారు. అనంతపురంలో పోలీసులు, రైల్వే ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొంటూ ఓ వ్యక్తి రైల్వే స్టేషన్‌ గేటు పక్కన ఉంటూ ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. తనకు రైల్వేలో ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో ఉద్యోగులు భయపడుతున్నారు. పోలీసు అధికారులకు కూడా తానే తత్కాల్‌ టికెట్లు ఇప్పిస్తానని చెప్పడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. రైల్వే స్టేషన్‌ ముఖద్వారంలో ఇద్దరు దళారులు  ఉంటూ తత్కాల్‌ టికెట్లు విక్రయిస్తున్నారు.


ఆర్పీఎఫ్‌ దాడుల్లో 37 టికెట్లు సీజ్‌

రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) పోలీసులు సెప్టెంబరు 29 నుంచి మూడు రోజుల పాటు అనంతపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండ ప్రాంతాల్లో ప్రైవేటు కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు. ఫేక్‌ ఐడీలను క్రియేట్‌ చేసి నెట్‌ సెంటర్లలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి టికెట్లు తీసుకునే వారిని గుర్తించి అరెస్టు చేశారు. ఇలా ఫేక్‌ ఐడీలను క్రియేట్‌ చేయడంతో రైల్వేకు రావాల్సిన పన్నులు ఎగవేతకు గురవుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో సురేష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.38,460 విలువ చేసే 31 టికెట్లను సీజ్‌ చేశారు. ఉరవకొండలో వినోద్‌ను అదుపులోకి తీసుకొని రూ.5,900 విలువైన 6 టికెట్లను సీజ్‌ చేశారు. శిర్డీ-గుత్తి, అనంతపురం-కోపర్‌గావ్‌, అనంతపురం-శిర్డీ, గుంతకల్లు- విజయవాడ, న్యూదిల్లీ-పుట్టపర్తి, గుంతకల్లు-గుంటూరు మార్గాల్లోని టికెట్లను స్వాధీనం చేసుకుని వాటిని రద్దు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని